పోక్సో కేసులో యడ్యూరప్పకు భారీ ఊరట.. అరెస్ట్ వద్దన్న కర్ణాటక హైకోర్టు

by S Gopi |
పోక్సో కేసులో యడ్యూరప్పకు భారీ ఊరట.. అరెస్ట్ వద్దన్న కర్ణాటక హైకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: లైంగిక వేధింపుల కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు బీఎస్ యడ్యూరప్పకు కర్ణాటక హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. పోక్సో కేసులో అరెస్ట్ తథ్యమని భావిస్తున్న సమయంలో జూన్ 17వ తేదీ వరకు అరెస్టు చేయకుండా హైకోర్టు రక్షణ కల్పించింది. యడ్యూరప్ప, బాధితుల తరపు న్యాయవాదుల వాదనలు విన్న కర్ణాటక హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు యడ్యూరప్పను అరెస్ట్ చేయొద్దని జస్టిస్ ఎస్ కృష్ణ దీక్షిత్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ధర్మాసనం సీఐడీ అధికారులను ఆదేశించారు. అలాగే, ఉద్దేశపూర్వకంగా మాజీ సీఎం యడ్యూరప్పపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. ఇదే సమయంలో 'ఆయనేమీ సాధారణ వ్యక్తి కాదు, ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. అతను దేశం విడిచి పారిపోతాడని అనుకుంటున్నారా?' అని సీఐడీ అధికారుల తరపు న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. ఈ క్రమంలో కర్ణాటక హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇస్తూ ఆదేశాలిచ్చింది. జూన్ 17న సీఐడీ అధికారుల ముందు హాజరు కావాలని యడ్యూరప్పను ఆదేశించిన కోర్టు విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed