మాజీ సీఎం మనవరాలి ఆత్మహత్య!

by Disha News Desk |
మాజీ సీఎం మనవరాలి ఆత్మహత్య!
X

బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. తన మనవరాలు సౌందర్య(30) బెంగళూరులోని నివాసంలో అనుమానాస్పద రీతిలో మరణించింది. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సౌందర్య 2018లో పెళ్లైంది. ఓ పాప కూడా ఉంది. కుటుంబ కలహాల కారణంగా ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

ఉదయాన్నే పనిమనిషి చూడటంతో వెలుగులోకి వచ్చింది. వెంటనే భర్త నీరజ్ కు సమాచారమివ్వగా, ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే సౌందర్య చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలిసిన వెంటనే సీఎం బసవరాజ్ బొమ్మై ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రెగ్నెన్సీ తర్వాత డిప్రెషన్ తో బాధపడుతున్నట్లు కర్ణాటక మంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed