ఒకే రన్‌వేపైకి రెండు విమానాలు.. విరిగిపోయిన ఎయిర్‌ఇండియా ప్లేన్ రెక్క

by GSrikanth |
ఒకే రన్‌వేపైకి రెండు విమానాలు.. విరిగిపోయిన ఎయిర్‌ఇండియా ప్లేన్ రెక్క
X

దిశ, వెబ్‌డెస్క్: కోల్‌కతా ఎయిర్‌పోర్టులో పెను ప్రమాదం తప్పింది. ల్యాండ్ అవుతున్న సమయంలో ఎయిర్ ఇండియా విమానం రెక్క విరిగిపోయింది. ఒకే రన్‌వేపైకి ఇండిగో, ఎయిర్‌ఇండియా విమానాలు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే, ప్రయాణికులు సేఫ్‌గా ఉన్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు స్పష్టం చేశారు. వెంటనే ప్రమాదంపై దర్యాప్తునకు డీజీసీఏ ఆదేశించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇటీవలే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఎయిర్ ఇండియా లిమిటెడ్‌పై రూ.80 లక్షల జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL), విమాన సిబ్బంది అలసట నిర్వహణ వ్యవస్థ (FMS) నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానా విధించారు. ఇది జరిగిన కొన్ని రోజులకే ప్రమాదం జరగడం కలకలం రేపుతోంది.

Advertisement

Next Story