బ్రిటన్ రాజు చార్లెస్3 ఇప్పుడు అధికారికంగా తన తల్లి కంటే ధనవంతుడు.. ఆయన సంపద ఎంతంటే!

by S Gopi |   ( Updated:2024-05-20 13:02:00.0  )
బ్రిటన్ రాజు చార్లెస్3 ఇప్పుడు అధికారికంగా తన తల్లి కంటే ధనవంతుడు.. ఆయన సంపద ఎంతంటే!
X

దిశ, నేషనల్ బ్యూరో: బ్రిటన్ రాజు చార్లెస్3 అధికారికంగా తన దివంగత తల్లి క్వీన్ ఎలిజబెత్ కంటే సంపన్నుడయ్యాడు. తాజా ది సండే టైమ్స్ రిచ్ లిస్ట్ 2024 ప్రకారం, 74 ఏళ్ల బ్రిటన్ రాజు ఛార్లెస్3 వ్యక్తిగత సంపద 770 మిలియన్ డాలర్లకు చేరుకోవడంతో ఆయన యూకేలోనే 258వ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. ఆయన తల్లి క్వీన్ ఎలిజబెత్ సంపద టైమ్స్ రిచ్ లిస్ట్ ప్రకారం, 2022, సెప్టెంబర్‌లో ఆమె మరణానికి ముందు 468 మిలియన్ డాలర్లుగా ఉంది. గతేడాది కింగ్ చార్లెస్ సంపద 12 మిలియన్ డాలర్లు పెరగడం గమనార్హం. టైమ్స్ ప్రకారం, కింగ్ చార్లెస్‌కు ఎస్టేట్‌లు, సాండ్రింగ్‌హోమ్ హౌస్, బాల్మోరల్ క్యాజిల్ వంటి అత్యంత విలువైన ఆస్తులున్నాయి. 1996లో విడాకుల సెటిల్‌మెంట్‌లో ఆయన దివంగత మాజీ భార్య ప్రిన్సెస్ డయానా 22.5 మిలియన్ డాలర్లు అందుకున్న తర్వాత కింగ్ చార్లెస్ తన సంపదను పెంచుకున్నాడని ఆయన మాజీ సహాయకుడు చెప్పాడు. 12,000 ఎకరాల భూమితో సహా 1.4 మిలియన్ డాలర్ల ఎస్టేట్ నుంచి లాభాల ద్వారా ఆయన సంపదను పెంచుకున్నాడు. కింగ్ చార్లెస్ తన తల్లి మరణం తర్వాత 151 మిలియన్ల డాలర్ల విలువైన పెట్టుబడి పోర్ట్‌ఫోలియోను వారసత్వంగా పొందాడు. దీనికి అదనంగా, కింగ్ చార్లెస్, రాజ కుటుంబం కూడా ప్రతి సంవత్సరం యూకే ప్రభుత్వం నుంచి అధికారిక రాజ విధులకు నిధులు సమకూర్చే సావరిన్ గ్రాంట్‌ను అందుకుంటారు. టైమ్స్ ప్రకారం, శతాబ్దాలుగా రాజ కుటుంబానికి చెందిన నగలు, ఆర్ట్ కలెక్షన్స్, బహుమతుల గురించి బహిరంగంగా తెలియనందున కింగ్ చార్లెస్ మొత్తం సంపదను అంచనా వేయడం కష్టం.

Advertisement

Next Story

Most Viewed