BREAKING: రాబోయే ఎన్నికల ఫలితాలు కొందరికి షాకిస్తాయ్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్

by Shiva |   ( Updated:2024-05-23 11:19:17.0  )
BREAKING: రాబోయే ఎన్నికల ఫలితాలు కొందరికి షాకిస్తాయ్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశం వ్యాప్తంగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వచ్చే ఫలితాలు కొందరికి షాకిస్తాయని, బీజేపీ నేతలను ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్‌లను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండియా కూటమి అనుకున్న దాని కంటే ఎక్కువగానే సీట్లు కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న 7 ఎంపీ సీట్లలో విజయం సాధిస్తామని స్పష్టం చేశారు. ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ నేడు రాజ్యాంగాన్నే మార్చేస్తానంటూ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని ఆరోపించారు. నిరుపేదల అస్తిత్వాన్ని కాపాడే రిజర్వేషన్లను కూడా తీసివెస్తామంటున్నారని మండిపడ్డారు. బీజేపీ పాలనలో నిరుపేదలకు ఒరిగిందేమి లేదని, దేశం సంపదనంతా అదానీకే దోచి పెడుతున్నాడని ధ్వజమెత్తారు. ఇక తెలంగాణలోనే కాంగ్రెస్ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోబోతోందిని రాహుల్ అన్నారు.

Read More..

రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడమే బీజేపీ లక్ష్యం: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

Advertisement

Next Story