BREAKING: హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఊహించని షాక్.. కుప్పకూలనున్న ప్రభుత్వం

by Shiva |   ( Updated:2024-02-28 04:21:22.0  )
BREAKING: హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఊహించని షాక్.. కుప్పకూలనున్న ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియా కూటమితో కేంద్రంలో పాగా వేద్దామని కలలు కంటున్న కాంగ్రెస్ పార్టీకి హిమాచల్ ప్రదేశ్‌లో ఊహించని షాక్ తగిలింది. నిన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో సొంత పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటేసి క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. దీంతో హిమాచల్ అసెంబ్లీలో కాంగ్రెస్ బలం మైనారిటీకి పడిపోయింది. ఈ క్రమంలోనే బీజేపీ తమకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి సంఖ్యా బలం లేనందున ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని బీజేపీ నేతలు నేడు గవర్నర్‌ను కోరనున్నట్లుగా తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా తీసుకునే నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ప్రస్తుతం హిమాచల్‌ ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 68 కాగా అందులో కాంగ్రెస్‌కు 40 మంది సభ్యులు, బీజేపీకి 25 మంది, ముగ్గురు స్వతంత్ర సభ్యులు ఉన్నారు రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు స్వతంత్రులు కూడా బీజేపీకి ఓటు వేయడంతో ఆ పార్టీ బలం ఒక్కసారిగా 34కు పెరిగింది. ఆరుగురు సభ్యులను కోల్పోవడంతో కాంగ్రెస్‌ బలం 34కు పడిపోయింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఒక్క సభ్యుని మద్దతు కూడగట్టడం బీజేపీకి పెద్ద కష్టమేమీ కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో త్వరలోనే హిమాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed