- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: మానవ అక్రమ రవాణా కేసులో ఎన్ఐఏ చార్జీషీట్ నమోదు..
దిశ, వెబ్‌డెస్క్: మానవ అక్రమ రవాణా చేస్తున్నారంటూ గత ఏడాది నవంబర్ 7న కేసు నమోదు చేసిన ఎన్ఐఏ ఆ దిశగా విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. హ్యూమన్ ట్రాఫికింగ్‌కు పాల్పడిన ముగ్గురు మయన్మార్ దేశస్థులపై ఎన్ఐఏ అధికారులు చార్జీషీట్ ఓపెన్ చేసింది. అయితే, ఎన్ఐఏ విచారణలో భాగంగా నిందితులు విస్తూపోయే నిజాలను వెల్లడించారు. భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల నంచి అక్రమంగా దేశంలోకి ప్రవేశించినట్లుగా ముగ్గురు నిందితులు ఒప్పుకున్నారు. అనంతరం నకిలీ ధృవీకరణ పత్రాలతో నకిలీ పత్రాలను ఆధార్ తీసుకున్నామని తెలిపారు. అలా దేశంలోని తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, జమ్ముకశ్మీర్‌లో పలువురితో పరిచయాలు పెంచుకున్నట్లుగా వెల్లడించారు. అనంతరం యువతులతో మాటలు కలిపి వారిని వివాహం చేసుకుని యువతులను అక్రమంగా దేశం దాటిస్తున్నట్లుగా విచారణలో వెల్లడైంది.