BREAKING: మేము గేట్లు ఎత్తితే ప్రత్యర్థుల పార్టీ ఆఫీసులే మిగులుతయ్: హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-04-16 14:58:42.0  )
Amit Shah Says, India Cant Develop Without Strong Cyber Security
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల వాతావరణం అవహించింది. ప్రముఖ రాజకీయ పార్టీల నేతలు ఇప్పటికే ప్రచార పర్వంలోకి దిగారు. ఈ క్రమంలోనే మంగళవారం హోం మంత్రి అమిత్ షా ఉత్తరాఖండ్‌‌లోని పౌడీ గడ్వాల్ జిల్లాలో ఎన్నికల ర్యాలీలో అమిత్‌షా ప్రసంగించారు. మేము గేట్లు ఎత్తితే పార్టీల ఆఫీసులే మిగుతాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ దేశానికి ఏమి చేయలేదని ఆరోపించారు. కొన్నేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీ, శివసేన, తృణమూల్ కాంగ్రెస్‌కు వలసలు పోతున్నారని, ఎక్కువ మంది నేతలు బీజేపీలో చేరారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలందరి కోసం బీజేపీ తలుపులు తెరిస్తే.. ఆ పార్టీ కార్యాలయ భవనాలే మిగులుతాయంటూ ఘటు వ్యాఖ్యలు చేశారు. గత కొద్ది నెలల్లోనే 14,000 కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీలో చేరారని అమిత్ షా వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed