- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BREAKING: పట్టాలు తప్పిన డిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్.. 12 బోగీలు పాక్షికంగా ధ్వంసం, నలుగురు దుర్మరణం
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో గురువారం మధ్యాహ్నం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. చండీగఢ్ నుంచి దిబ్రూగఢ్‌కు వెళ్తున్న ట్రైన్ నెంబర్ 15904, డిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ గోండా సమీపంలోని జిలాహి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో మొత్తం 12 బోగిలు పక్కకు ఒరిగి పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. అదేవిధంగా ఏసీ కోచ్ పరిస్థితి అధ్వానంగా మారింది. ఒక్కసారిగా రైలు పట్టాలు తప్పగా అందులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురై భయంతో కేకలు వేశారు. అప్రమత్తమైన లోకో పైలట్ రైలును ఆపగా వెంటనే ప్రయాణికులు ట్రైన్ నుంచి బయటకు వచ్చేశారు. అయితే, ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మృతి చెందినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. పలువురు ప్రయాణికులకు మాత్రం గాయాలైనట్లుగా సమాచారం. ఈ ఘటనకు గల కారణాలపై రైల్వే శాఖ దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది. రైలు ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరా తీశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.