Bofors scam: మరోసారి తెరపైకి వచ్చిన బోఫోర్స్ కుంభకోణం

by Shamantha N |
Bofors scam: మరోసారి తెరపైకి వచ్చిన బోఫోర్స్ కుంభకోణం
X

దిశ, నేషనల్ బ్యూరో: బోఫోర్స్‌ కుంభకోణం (Bofors Scam) మరోసారి తెరపైకి వచ్చింది. 1980-90ల్లో దేశ రాజకీయాలో దుమారం సృష్టించిన ఈ స్కాంపై సీబీఐ(CBI) మరోసారి సమగ్ర దర్యాప్తునకు రెడీ అయ్యింది. అందులో భాగంగానే యూఎస్ ప్రైవేటు ఇన్వెస్టిగేటర్ నుంచి కీలక సమాచారం సేకరించేందుకు సీబీఐ అమెరికా సాయం కోరింది. ఫెయిర్‌ఫాక్స్‌ గ్రూప్‌ అధినేత, ప్రైవేటు ఇన్వెస్టిగేటర్‌ మైఖేల్ హెర్ష్‌మన్‌ 2017లో భారత్‌లో పర్యటించారు. అప్పుడే భోపోర్స్ కుంభకోణం గురించి ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆ కేసును పక్కదారి పట్టించేందుకు అప్పటి కాంగ్రెస్‌ (Congress) ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు. అందుకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని పంచుకునేందుకు రెడీగా ఉన్నానని వ్యాఖ్యానించారు. అయితే, ఈ కేసులోనే మైఖేల్ నుంచి సాక్ష్యాలు తీసుకునేందుకు అనుమతినివ్వాలంటూ అమెరికాకు (USA) సీబీఐ న్యాయపరంగా అభ్యర్థన పంపింది.

లెటర్ ఆఫ్ రొటేటరీ

అయితే, అప్పట్లో మైఖేల్‌ చేసిన ఆరోపణలను సీబీఐ సుమోటోగా స్వీకరించి దర్యాప్తు చేపట్టింది. అతడి నుంచి సమాచారం తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ అమెరికా అధికారులను చాలాసార్లు కోరింది. అయితే, అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో లెటర్‌ రొటేటరీ పంపేందుకు సీబీఐ భారత హోంశాఖను సంప్రదించింది. కేసుల విచారణ, దర్యాప్తు సహకారం కోసం ఒక దేశంలోని కోర్టు.. మరో దేశంలోని కోర్టుకు లిఖిత పూర్వకంగా పంపే అభ్యర్థనే ఈ లెటర్‌ రొటేటరీ (ఎల్‌ఆర్‌). దీన్ని పంపేందుకు ఈ ఏడాది జనవరి 14న హోంశాఖ సీబీఐకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఆ తర్వాత ప్రత్యేక కోర్టులో ఫిబ్రవరి 11నే ఈ ఎల్‌ఆర్‌ అప్లికేషన్‌ను దర్యాప్తు సంస్థ అమెరికాకు పంపించింది. దీనిపై వాషింగ్టన్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు.

Next Story

Most Viewed