- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 12 లోపే: యడియూరప్ప
బెంగళూరు: సీనియర్ బీజేపీ నేత, కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏప్రిల్ 12 లోగా కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లోనూ తమ పార్టీనే గెలిచి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో ఎలాంటి గందరగోళం లేదని, అందరూ ఐక్యంగా ఉన్నారని చెప్పారు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి శనివారం ఆయన మాట్లాడారు.
మహిళలు, యువకుల మద్దతు పొందేందుకు ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలను, నాయకులను కోరారు. డబ్బు, కండబలం, మత రాజకీయాలను ఉపయోగించుకుని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే రోజులు పోయాయని అన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ 130-140 సీట్లలో స్పష్టమైన మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఒకే పార్టీ ప్రజలకు వేగవంతంగా మేలు జరుగుతుందని చెప్పారు. మరోవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌కు ఇంఛార్జిగా, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలైకి కో-ఇంఛార్జిగా బాధ్యతలు అప్పగించింది.