‘డీఎంకే ఫైల్స్’ విడుదల చేసిన బీజేపీ

by srinivas |
‘డీఎంకే ఫైల్స్’ విడుదల చేసిన బీజేపీ
X
  • అధికార పార్టీ నేతల వద్ద రూ.1.34 లక్షల కోట్లు ఆస్తులు
  • అవినీతికి పాల్పడ్డారని కాషాయ నేత అన్నమళై విమర్శలు
  • హాస్యాస్పదమన్న డీఎంకే పార్టీ

చెన్నై: కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందంటూ కాంగ్రెస్ ఫైల్స్ విడుదల చేసి సంచలనం సృష్టించిన బీజేపీ తమిళనాడు ప్రభుత్వంపై దాడి చేసింది. శుక్రవారం డీఎంకే ఫైల్స్ పేరుతో వీడియోను విడుదల చేసింది. డీఎంకే సీఎం ఎంకే స్టాలిన్, క్రీడా మంత్రి ఉదయనిధి స్టాలిన్, ఇతర మంత్రులు ఆస్తులు రూ.1.34 లక్షల కోట్లు ఉన్నాయని ఆరోపిస్తూ బయటపెట్టింది. డీఎంకే అధికారంలో ఉన్న సమయంలో 2011 అసెంబ్లీ ఎన్నికల ముందు రూ.2వేల కోట్లు స్టాలిన్ లంచం తీసుకున్నారని బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నమళై ఆరోపించారు. అనేక మంది ఎలక్ట్రోరల్ అఫిడవిట్స్ లో పేర్కొన్న దాని కన్నా ఎక్కువగా ఆస్తులను కలిగి ఉన్నారని అన్నమళై అన్నారు. తన ఆరోపణలను జర్నలిస్టులు నిర్ధారించేందుకు వారం రోజుల గడువిస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు అన్నమళై ఆరోపణలను డీఎంకే ఎంపీ భారతి తప్పబట్టారు. అవి పూర్తి హస్యాస్పదమని అన్నారు. తమ ఆస్తుల వివరాలు ఎన్నికల అఫిడవిట్లో సమర్పించామని, ఏదైనా ఉల్లంఘన జరిగితే ఎన్నికను సవాల్ చేయమని చెప్పారు. రూ.200 కోట్ల అవినీతి ఆరోపణలపై కేసు నమోదు చేయాలని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు.

Advertisement

Next Story

Most Viewed