- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ నూతన యాత్ర.. ప్రారంభించిన జేపీ నడ్డా
బెంగళూరు: కర్ణాటక లో అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ నూతన యాత్రకు తెరలేపింది. బుధవారం చామ్ రాజ్ నగర్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విజయ్ సంకల్ప్ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల నుంచి యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. యాత్ర ద్వారా 8 వేల కిలోమీటర్లు చేరుకుంటామని చెప్పారు. ప్రధాని మోడీ రాజకీయాల నిర్వచనాన్నే మార్చేశారని తెలిపారు. ప్రతి చోటా ప్రజలను కలుపుతూ విజయ్ సంకల్ప్ యాత్రలో 'విజయ్ సంకల్పం' ను ముందుకు తీసుకెళ్లడం ద్వారా బీజేపీ ముందుకు సాగుతుందని నడ్డా అన్నారు.
ఒకప్పుడు కులతత్వం, ఓటు బ్యాంకు, కుటుంబ ప్రాతిపదికన రాజకీయాలు ఉండేవని.. అయితే దేశాన్ని ఒకేలా అభివృద్ధి చేసేందుకు ప్రధాని మోదీ సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్ మంత్రం పట్టారన్నారు. ఈ యాత్రలో 80 ర్యాలీలు, 75 బహిరంగ సభలు, 150 రోడ్ షోలు ఉండనున్నాయి. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ యాత్రలో పాల్గొననున్నారు. ఇప్పటికే ఈ ఏడాది పలుమార్లు కర్ణాటకలో పర్యటించిన ప్రధాని మోదీ, ఈ నెల 25న దేవనగరీ ర్యాలీలో ఆయన ప్రసంగించనున్నారు.