- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ ఇక పొలిటికల్ పార్టీ కాదు: కాంగ్రెస్ నేత చిదంబరం విమర్శలు
దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం విమర్శలు గుప్పించారు. బీజేపీ ఇక నుంచి రాజకీయ పార్టీ కాదని మోడీని ఆరాదించే బ్యాచ్‌లా మారిందని అభివర్ణించారు. పదేళ్ల ఎన్డీయే పాలనలో వాక్ స్వాతంత్ర్యపు హక్కు, భావ ప్రకటనా స్వేచ్ఛలు హరించబడ్డాయని తెలిపారు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ రూపొందించిన మేనిఫెస్టోను ఉద్దేశించి ప్రస్తావిస్తూ..దానికి మేనిఫెస్టో అని పేరు పెట్టలేదని మోడీ హామీ అని పేరు పెట్టారని తెలిపారు. అందుకే బీజేపీ ఇక పొలిటికల్ పార్టీ కాదు మోడీని ఆరాదించే బ్యాచ్ మాత్రమే అని విమర్శించారు.
మోడీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఉందని తెలిపారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మొదటి పార్లమెంటు సెషన్‌లోనే సీఏఏను రద్దు చేస్తామని తెలిపారు. దేశంలో నిరుద్యోగం అతిపెద్ద సవాల్‌గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మతం బలం పుంజుకుంటే అది నియంతృత్వానికి దారి తీస్తుందని చెప్పారు. కాగా, మరికాసేపట్లో జార్ఖండ్‌లోని రాంచీలో ఇండియా కూటమి ర్యాలీ జరగనుంది. దీనికి 28 పార్టీల నేతలు హాజరు కానున్నారు.