Haryana Assembly Elections: సై అంటే సై.. సీఎం సీటు కోసం బీజేపీలో ఇంటర్నల్ వార్?

by karthikeya |   ( Updated:2024-09-16 08:35:11.0  )
Haryana Assembly Elections: సై అంటే సై.. సీఎం సీటు కోసం బీజేపీలో ఇంటర్నల్ వార్?
X

దిశ, వెబ్‌డెస్క్:అసెంబ్లీ ఎన్నికలు (Assembly) దగ్గరపడుతున్న టైంలో హర్యానా (Haryana) బీజేపీలో సీఎం సీటు కోసం పోటీపడేవారి సంఖ్య పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం అధికారంలో బీజేపీ (BJP) తరపున నాయాబ్ సైనీ (Nayab Saini) సీఎంగా ఉన్నారు. అయితే ఎన్నికల తర్వాత కూడా ఆయనే సీఎంగా ఉంటారా..? అంటే ‘‘ఏమో! ఉండొచ్చు.. లేదా ఉండకపోవచ్చు..’’ అనే సమాధానమే వినిపిస్తోంది. దీనికి ఇటీవల ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అనిల్ విజ్ (Anil Viz) చేసిన వ్యాఖ్యలు బలం చేకూరుస్తుంటే.. అదే పార్టీ నేత, కేంద్ర మంత్రి, హర్యానా ఎన్నికల వ్యవహారాల కార్యదర్శి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradan) చేసిన వ్యాఖ్యలు వ్యతిరేకంగా ఉన్నాయి.

కొద్ది రోజుల క్రితం మీడియాతో మాట్లాడిన అనిల్ విజ్.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒకవేళ అధిష్ఠానం తనకి రాష్ట్ర సీఎం (CM) పదవీ బాధ్యతలు అప్పగిస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. దీంతో హర్యానా బీజేపీలో ఇంటర్నల్ వార్ మొదలైందనే వార్తలు వినిపించసాగాయి.

కాగా.. తాజాగా అనిల్ విజ్ వ్యాఖ్యలపై స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్.. బీజేపీ సీనియర్ కార్యకర్త రూపంలో విజ్ ఆ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని, అయితే తమ సీఎం అభ్యర్థి ముమ్మాటికీ నాయాబ్ సైనీయేనని స్పష్టం చేశారు. సైనీ ఆధ్వర్యంలోనే తాము ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నామని, అలాగే గెలిచి హ్యాట్రిక్ కొట్టబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎంలను మార్చడం బీజేపీకి కొత్తేం కాదు. ఈ మధ్య జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సైతం సంచలన నిర్ణయాలు తీసుకున్న బీజేపీ అధిష్ఠానం.. ఎన్నికల్లో గెలిచిన వెంటనే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో సీఎంలను మార్చేసింది. ఇక హర్యానాలో కూడా మార్చి ముందు వరకు మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar) బీజేపీ తరపున సీఎంగా ఉండగా.. ఉన్నట్లుండి ఆయనను తొలగించి నాయాబ్ సైనీని సీఎంగా ప్రకటించింది బీజేపీ అధిష్ఠానం. ఈ క్రమంలోనే హర్యానాలో ఎన్నికల అనంతరం ఒకవేళ బీజేపీ గెలిస్తే.. కొత్త నేతను సీఎం చేసే అవకాశాలు లేకపోలేదు.

Advertisement

Next Story

Most Viewed