అంధేరిలో పోటీ నుంచి తప్పుకున్న బీజేపీ.. కారణమిదే !

by GSrikanth |
అంధేరిలో పోటీ నుంచి తప్పుకున్న బీజేపీ.. కారణమిదే !
X

ముంబై: అంధేరి ఉపఎన్నిక నుంచి బీజేపీ తప్పుకుంది. సోమవారం కాషాయ పార్టీ తరుఫున అభ్యర్థి ముర్జీ పటేల్ తన నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నారు. ఉద్ధవ్ ఠాక్రే శివసేన అభ్యర్థి రుతుజా లత్కేపై పోటీగా నిలిచిన తమ అభ్యర్థి ఉపసంహరించుకుంటున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే ప్రకటించారు. ఒకవేళ పోటీలో ఉంటే తామే గెలిచేవారమని అన్నారు. అంతకుముందు మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ థాక్రే బీజేపీని పోటీని తప్పుకోవాలని కోరుతూ లేఖ రాశారు. మరణించిన మాజీ ఎమ్మెల్యే రమేష్ లత్కేకు గౌరవ సూచికంగా ఆమె భార్య రుతుజా లత్కేపై పోటీ చేయొద్దని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన బీజేపీ ఆయన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు షిండే-బీజేపీ తరుఫు అభ్యర్థి నామినేషన్ విత్ డ్రా చేసుకుంది. దీంతో థాక్రే శివసేనకు గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే నెల 3న ఉపఎన్నిక జరగనుంది.

Advertisement

Next Story