- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BJP : బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలకు ప్రధాని మోడీ కీలక సందేశం
దిశ, నేషనల్ బ్యూరో : ప్రజా సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేస్తేనే అభివృద్ధిచెందిన భారతావని సాకారం అవుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. దేశాభివృద్ధి అనే ఏకైక ఎజెండాతో ముందుకు సాగితేనే వికసిత భారత్ సాక్షాత్కరిస్తుందని పేర్కొన్నారు. శనివారం ఢిల్లీలో ప్రారంభమైన బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల మండలి సమావేశం ఆదివారం ముగిసింది. ఈసందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరై ప్రసంగించారు.
దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఎక్కడికక్కడ అమలు చేయాలన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు సోషల్ మీడియాను సమర్ధంగా వినియోగించుకోవాలని సీఎంలకు ప్రధాని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, హోంమంత్రి అమిత్‌షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు.