- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ మాజీ వీసీకి బీజేపీలో కీలక పదవి
దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా పలువురికి బీజేపీ జాతీయ కమిటీలో స్థానం కల్పిస్తూ ఆ పార్టీ చీఫ్ జేపీ నడ్డా నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ మాజీ వీసీ తారిక్ మన్సూర్ ను బీజేపీ జాతీయ వైస్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ జేపీ నడ్డా ఉత్వర్వులు జారీ చేశారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన తారిక్ మన్సూర్ ఢిల్లీలోని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ వీసీగా పని చేసి రిటైర్ అయ్యారు.
2020లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (CAA), ప్రతిపాదిత నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC)కి వ్యతిరేకంగా అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో నిరసనలు జరిగినప్పుడు తారిక్ ఆ యూనివర్సిటీకి వీసీగా ఉన్నారు. ఆ సమయంలో విద్యార్థుల నిరసనను ఆయన కట్టడి చేయగలిగారు. ఇక లోక్ సభ ఎన్నికలకు గడువు దగ్గరపడుతుండటంతో పార్టీకి ముస్లింలను దగ్గర చేయడానికి బీజేపీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.