J&K Polls: - తొలిజాబితా విడుదల చేసి.. అంతలోనే వెనక్కి తగ్గి..

by Shamantha N |
J&K Polls: -	తొలిజాబితా విడుదల చేసి.. అంతలోనే వెనక్కి తగ్గి..
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్‌ లో అసెంబ్లీ ఎన్నికల బీజేపీ కసరత్తులు ప్రారంభించింది. అందులో భాగంగానే సోమవారం ఉదయం తొలి జాబితాను విడుదల చేసింది. అంతలోనే ఆ జాబితాపై వెనక్కి తగ్గింది. మళ్లీ కొన్నిగంటల తర్వాత 15 మందితో కూడిన సవరించిన జాబితాను విడుదల చేసింది. అయితే, సోమవారం ఉదయం 44 మందితో కమలం పార్టీ తొలి జాబితాను విడుదల చేసింది. తొలి విడతలో 15 మంది, రెండో విడత కోసం 10 మంది, మూడో దశకు 19 మంది అభ్యర్థులను ఖరారు చేసినట్లు ప్రకటన విడుదల చేసింది. అయితే, ఆ లిస్ట్ లో ముగ్గురు కీలక వ్యక్తుల పేర్లు లేకపోవడంతో..దీనిపై చర్చ ప్రారంభమైంది. బీజేపీ జమ్ముకశ్మీర్‌ చీఫ్ రవీందర్‌ రైనా, మాజీ ఉప ముఖ్యమంత్రులు నిర్మల్‌ సింగ్‌, కవీందర్‌ గుప్తాకు తొలి జాబితాలో చోటు దక్కలేదు. దీనిపై అభ్యంతరాలు రావడంతో జాబితాను వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఉపసంహరించుకున్న జాబితాలో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ సోదరుడు దేవేంద్ర సింగ్‌ రానాను నాగరోటా నుంచి నిలబెట్టడం గమనార్హం.

ఎన్నికల ఎప్పుడంటే?

ఇద్దరు కశ్మీరీ పండిట్‌లు, 14 మంది ముస్లిం అభ్యర్థుల పేర్లు తొలగించిన జాబితాలో కూడా ఉన్నాయి. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, పాంథర్స్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన వారి పేర్లు కూడా ఆ జాబితాలో ఉన్నాయి. సెప్టెంబర్‌ 18 నుంచి మూడు దశల్లో జమ్ముకశ్మీర్ లో పోలింగ్ జరగనుంది. సెప్టెంబర్ 25న రెండో విడత, అక్టోబర్ 1న తుదివిడత పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. కాగా.. మొత్తం 90 నియోజకవర్గాలకు గాను తొలి దశలో 24 స్ధానాలకు, రెండో విడతలో 26 స్థానాలకు, తుదిదశలో 40 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఈసారి జమ్ముకశ్మీర్‌లో బీజేపీ, పీడీపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌-కాంగ్రెస్‌ కూటమి మధ్య త్రైపాక్షిక పోటీ నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed