- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వెండితెరపైకి మోడీ జీవిత చరిత్ర.. ప్రధాని బయోపిక్‌కు క్రేజీ టైటిల్ ఫిక్స్
దిశ, డైనమిక్ బ్యూరో: సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం బయోపిక్‌ల హవా నడుస్తోంది. ప్రముఖుల జీవిత కథల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ రాబోతున్నది. ఈ సినిమాకు క్రేజీ టైటిల్‌ను సైతం మూవీ టీమ్ అనౌన్స్ చేసింది. 'విశ్వ నేత' పేరుతో అన్ని భారతీయ భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. యువ ప్రతిభాశాలి సీ.హెచ్. క్రాంతి కుమార్ డైరెక్షన్‌లో 'వందే మీడియా ప్రైవేట్ లిమిటెడ్' పతాకంపై కాశిరెడ్డి భరత్ రెడ్డి మోడీ బయోపిక్‌ను నిర్మిస్తున్నారు.
ఈ మూవీలో అభయ్ డియోల్, నీనా గుప్తా, అనుపమ్ ఖేర్, పల్లివి జోషి ముఖ్యపాత్రలు పోషించనున్నారు. ఈ సినిమాకు కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం సమకూర్చనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయని త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు. కేంద్రంలో బీజేపీని రెండు పర్యాయములు అధికారంలోకి తీసుకురావడంలో మోడీ కీలక పాత్ర పోషించారు. మరోసారి అధికారంలోకి రావడం ద్వారా హ్యాట్రిక్ విక్టరీ దిశగా ప్రణాళికలు రచిస్తున్నారు.
రామమందిర ప్రతిష్టాపన నేపథ్యంలో మూడోసారి బీజేపీ విజయం ఇక లాంఛనమే అనే చర్చ జరుగుతున్న వేళ ఈ సినిమాలో మోడీ బాల్యం నుంచి, ప్రధాని వరకు ఆయన జీవితంలోని సంఘటనలను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు, డిమానిటైజేషన్, జీఎస్టీ అంశాలతో పాటు అయోధ్య రామ మందిర నిర్మాణం వంటి ఎన్నో కీలక అంశాల ప్రస్తావన విశ్వనేత మూవీలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.