సచివాలయానికి సైకిల్ పై వచ్చిన మంత్రి

by Javid Pasha |   ( Updated:22 Feb 2023 10:17 AM  )
సచివాలయానికి సైకిల్ పై వచ్చిన మంత్రి
X

దిశ, వెబ్ డెస్క్: బీహార్ పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రి, ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ సచివాలయానికి సైకిల్ పై వచ్చారు. ఆయనతో పాటు ఆయన సెక్యూరిటీ కూడా సైకిళ్లపైనే ఆయనను ఫాలో అవుతూ వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ మాట్లాడుతూ..సమాజ్ వాది పార్టీ మాజీ అధ్యక్షుడు, దివంగత నేత ములాయం సింగ్ యాదవ్ రాత్రి తన కలలోకి వచ్చారని అన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని తాను ఈరోజు సెక్రటేరియట్ కు సైకిల్ పై వచ్చానని స్పష్టం చేశారు.

పర్యావరణ పరిరక్షణపై అవగాహన తీసుకొచ్చేందుకే తాను సైకిల్ పై సెక్రటేరియట్ కు వచ్చానని మంత్రి తెలిపారు. కార్లు, బైకుల వినియోగం వల్ల పర్యావరణం కాలుష్యం అవుతోందని, సైకిళ్లు వాడటం వల్ల కాలుష్యాన్ని కొంతవరకైనా తగ్గించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Next Story