Arvind Kejriwal: - హర్యానా ఎన్నికల ఫలితాలపై కేజ్రీవాల్ ఏమన్నారంటే?

by Shamantha N |   ( Updated:2024-10-08 10:51:59.0  )
Arvind Kejriwal: -	హర్యానా ఎన్నికల ఫలితాలపై కేజ్రీవాల్ ఏమన్నారంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీపార్టీ(AAP) ఘోరంగా ఓడిపోయింది. ఒంటరిగా బరిలోకి దిగిన ఆప్.. ఒక్కస్థానంలోనూ గెలవలేకపోయింది. కాగా.. ఈ ఫలితాలపై ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) స్పందించారు. ఎన్నికల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదన్నారు. ‘‘ ఢిల్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. వాటిని అస్సలు తేలిగ్గా తీసుకోకూడదు. ఎప్పుడూ అతివిశ్వాసంతో ఉండొద్దనేది ఈ ఎన్నికలు నేర్పిన గుణపాఠం. ప్రతి ఎన్నిక, ప్రతి స్థానం కఠినమైనదే. గెలుపు కోసం తీవ్రంగా కష్టపడి పనిచేయాలి. అంతర్గత పోరు ఉండకూడదు’’ అని పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేశారు.

ఖాతా కూడా తెరవని ఆప్

కేజ్రీవాల్ సొంత రాష్ట్రమైన హర్యానాలో ఆప్ ఖాతా కూడా తెరవకపోవడం గమనార్హం. ఇకపోతే, హర్యానాలో బీజేపీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పయనిస్తోంది. ఇండియా కూటమి పార్టీలైన కాంగ్రెస్, ఆప్‌.. ఈ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశాయి. దీంతో ఓట్ల చీలక ఏర్పడటంతో.. బీజేపీ లాభపడింది. ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసివస్తుందని అంచనా వేసిన కాంగ్రెస్ పార్టీ ఆశలు గల్లంతయ్యాయి. మరోవైపు, త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఫలితాలతో ఆప్ మరింత అప్రమత్తంగా నిర్ణయాలు తీసుకోనుంది.

Advertisement

Next Story

Most Viewed