TGSRTC: ఆస్తుల కోసం బంధాల్ని దూరం పెట్టడం విచారకరం.. దిశ కథనానికి స్పందించిన సజ్జనార్

by Ramesh Goud |   ( Updated:2024-10-23 06:35:52.0  )
TGSRTC: ఆస్తుల కోసం బంధాల్ని దూరం పెట్టడం విచారకరం.. దిశ కథనానికి స్పందించిన సజ్జనార్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆస్తులు ముఖ్యమై బంధాల్ని దూరం పెట్టడం విచారకరమని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. 'బతికుండగానే శ్మశానానికి..' వృద్ధురాలిని తెచ్చిపడిసిన బంధువులు.. తంగళ్లపల్లిలో అమానవీయ ఘటన అని "దిశ పత్రిక" లో వచ్చిన కథనాన్ని ట్విట్టర్ లో పోస్టు చేసిన ఆయన.. భావోద్వేగంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. దీనిపై మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేదు చూడు మానవత్వము నేడు అని ఆర్ నారాయణ మూర్తి నటించిన ఎర్రసముద్రం సినిమా పాటలోని మాటలను జోడించాడు. అంతేగాక కొందరిలో వ్యక్తిగత స్వార్థం ఎక్కువై.. ఆస్తులు, డబ్బే ముఖ్యమై.. ఇలా బంధాల్నే దూరం పెట్టె దుస్థితి నెలకొనడం విచారకరమని సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed