కేజ్రీవాల్, అతిశీలకు సుప్రీం కోర్టులో భారీ ఊరట

by M.Rajitha |
కేజ్రీవాల్, అతిశీలకు సుప్రీం కోర్టులో భారీ ఊరట
X

దిశ, వెబ్ డెస్క్ : పరువునష్టం కేసులో ఆప్(AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejrival), ఢిల్లీ(Delhi) సీఎం అతిషి(Athishi)లకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వచ్చే నెల 3న జరగనున్న ట్రయల్ కోర్ట్ విచారణపై స్టే విధించింది. 2018లో దేశ రాజధాని ఢిల్లీలో ఓటర్ల జాబితా నుండి 30 లక్షల ఓటర్ల పేర్లను తొలగింపులో బీజేపీ ప్రమేయం ఉందని కేజ్రీవాల్, అతిశీలు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఢిల్లీ హైకోర్టులో పరువునష్టం కేసు దాఖలు చేయగా.. ప్రాథమికంగా ఈ వ్యాఖ్యలు పరువునష్టం కిందకి వస్తాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. 2020లో ఇచ్చిన స్టేను తొలగించి, తిరిగి విచారణ చేపట్టిన కోర్ట్.. అక్టోబర్ 3న హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై అతిశీ, కేజ్రీవాల్.. తమపై దాఖలైన పరువునష్టం కేసును కొట్టివేయాలని సుప్రీంకోర్టుకు వెళ్లారు. సోమవారం ఈ కేసులో విచారణ చేపట్టిన సుప్రీం.. ప్రాథమికంగా మీ పరవుకు భంగం కలిగించినట్టు ఎక్కడా ఫిర్యాదులో పేర్కొనలేదు కాబట్టి పరువునష్టం కింద సమన్లు జారీ చేయడం సాధ్యం కాదని వ్యాఖ్యానిస్తూ.. ట్రయల్ కోర్ట్ విచారణపై స్టే విధించింది.

Advertisement

Next Story

Most Viewed