Haryana Elections: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ముందు జేజేపీకి షాక్

by Shamantha N |   ( Updated:2024-08-17 13:50:39.0  )
Haryana Elections: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ముందు జేజేపీకి షాక్
X

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానా ఎన్నికలకు ముందు జననాయక్ జనతా పార్టీకి షాక్ తగిలింది. జేజేపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. జేజేపీకి మొత్తం పది మంది ఎమ్మెల్యేలు ఉండగా.. వారిలో నలుగురు రాజీనామా చేశారు. అయితే, వారెవరూ ఇంకా ఏ పార్టీలో చేరలేదు. ఎమ్మెల్యేలు ఈశ్వర్ సింగ్, రామ్‌కరణ్ కాలా, దేవేంద్ర బబ్లీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి శనివారం రాజీనామా చేశారు. మరో ఎమ్మెల్యే అనూప్ ధనక్ శుక్రవారం రాజీనామా చేశారు. కాంగ్రెస్ లేదా బీజేపీలో వారు చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

జేజేపీకి షాక్

మాజీ డిప్యూటీ సీఎం నేతృత్వంలోని జేజేపీ, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రామ్‌నివాస్ సుర్జాఖేరా, జోగి రామ్ సిహాగ్‌లపై అనర్హత వేటు వేయాలని గతంలో కోరింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేశారు. నార్నౌండ్ కు చెందిన మరో ఎమ్మెల్యే రాంకుమార్ గౌరమ్మ కొంతకాలంగా జేజేపీకి వ్యతిరేకంగానే ఉన్నారు. పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు నిర్వహించిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రామ్‌నివాస్ సుర్జాఖేరా, జోగి రామ్ సిహాగ్‌లపై అనర్హత వేటు వేయాలని జేజేపీ గతంలోనూ కోరింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేశారు. నార్నౌండ్‌కు చెందిన మరో ఎమ్మెల్యే రాంకుమార్ గౌరమ్మ కొంతకాలంగా పార్టీని వ్యతిరేకిస్తున్నారు. దుష్యంత్ చౌతాలా, అతని తల్లి నైనా చౌతాలా, అమర్ జిత్ ధండాలు మాత్రమే ఆ పార్టీకి విధేయులుగా మిగిలారు. హర్యానాలోని 90 స్థానాలకు అక్టోబర్ 1న ఓటింగ్ జరగనుంది. అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు జరగనున్నట్ల ఎన్నికల సంఘం ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed