బిగ్ అలర్ట్.. నకిలీ పాస్‌పోర్ట్ వెబ్‌సైట్లను ప్రకటించిన ప్రభుత్వం

by Mahesh |   ( Updated:2023-08-18 10:41:37.0  )
బిగ్ అలర్ట్.. నకిలీ పాస్‌పోర్ట్ వెబ్‌సైట్లను ప్రకటించిన ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్: పాస్ పోర్టు పేరిటి ఎర్పాటు చేయబడిని ఆరు నకిలీ పాస్‌పోర్ట్ వెబ్‌సైట్‌లను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటింది. కాబట్టి ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్ అప్లై చేయాలనుకునే వారు వీటికి దూరంగా ఉండాలని ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ నకిలీ పాస్‌పోర్ట్ వెబ్‌సైట్‌లు ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ నింపడానికి, పాస్‌పోర్ట్ సంబంధిత సేవల కోసం అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేయడానికి అదనంగా భారీ ఛార్జీలను కూడా వసూలు చేస్తున్నాయని, పాస్‌పోర్ట్ సేవల కోసం అధికారిక వెబ్‌సైట్‌లో పాప్-అప్‌గా కనిపించే అలర్ట్ చెబుతోంది. ఇలాంటి మోసపూరిత పాస్‌పోర్ట్ వెబ్‌సైట్‌లు, మొబైల్ అప్లికేషన్‌లు డేటాను సేకరించడం ద్వారా ప్రజలను మోసం చేస్తున్నాయని మంత్రిత్వ శాఖ పాస్‌పోర్ట్ విభాగం హెచ్చరించింది. ముఖ్యంగా www.indiapassport.org, www.online-passportindia.com, www.passportindiaportal.in, www.passport-india.in, www.passport-seva.in, www.applypassport. org వంటి వెబ్ సైట్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

Advertisement

Next Story

Most Viewed