Delhi: రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ రోజే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రధానం

by Harish |
Delhi: రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ రోజే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రధానం
X

దిశ, నేషనల్ బ్యూరో: గురువారం(సెప్టెంబర్ 5) నాడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల జాతీయ ఉపాధ్యాయుల అవార్డు 2024కు ఎంపిక చేసిన 82 మంది అవార్డు గ్రహీతలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో అవార్డులను ప్రధానం చేయనున్నారు. విద్యా మంత్రిత్వ శాఖ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, ఎంపికైన 50 మంది ఉపాధ్యాయులు 28 రాష్ట్రాలు, 3 యూటీలు, 6 సంస్థల నుండి ఉన్నారు. ఎంపికైన ఉపాధ్యాయుల్లో 34 మంది పురుషులు, 16 మంది మహిళలు, 2 మంది వికలాంగులు, ఒకరు ప్రత్యేక అవసరాలు గల పిల్లలతో (CWSN) పనిచేస్తున్నారు. అదనంగా, ఉన్నత విద్యా శాఖ నుండి 16 మంది ఉపాధ్యాయులు, స్కిల్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ నుండి 16 మంది ఉపాధ్యాయులకు కూడా అవార్డులను రాష్ట్రపతి అందించనున్నారు. ఇప్పటికే అధికారులు అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి అవార్డుకు మెరిట్ సర్టిఫికెట్, రూ.50,000 నగదు, రజత పతకం ఉంటాయి. అవార్డు గ్రహీతలకు ప్రధానితో మాట్లాడే అవకాశం కూడా లభిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed