Anti Rape Bill : యాంటీ రేప్ బిల్లును రాష్ట్రపతికి పంపిన బెంగాల్ గవర్నర్

by Hajipasha |
Anti Rape Bill : యాంటీ రేప్ బిల్లును రాష్ట్రపతికి పంపిన బెంగాల్ గవర్నర్
X

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతా మెడికల్ కాలేజీలో ఓ జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన జరిగిన నేపథ్యంలో యాంటీ రేప్ బిల్లు(అపరాజిత)ను పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఈనెల 3న ఆమోదించింది. అనంతరం ఆ బిల్లును మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్‌ ఆమోదం కోసం పంపింది. అయితే దాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పరిశీలన కోసం గవర్నర్ పంపారని బెంగాల్ రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. యాంటీరేప్ బిల్లులో పలు లోపాలు, అసమగ్రతను గవర్నర్ గుర్తించారని తెలిపాయి.

‘‘ఈ బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చల వివరాలను, వాటి అనువాదం కాపీలను గవర్నర్‌కు అందించడంలో బెంగాల్ అసెంబ్లీ సెక్రటేరియట్ విఫలమైంది. కనీస నిబంధనలను పాటించకపోవడం దారుణం’’ అని పేర్కొంటూ బెంగాల్ రాజ్‌‌భవన్ శుక్రవారం రోజు ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేసింది. ‘‘యాంటీ రేప్ బిల్లును ఒకవేళ గవర్నర్ ఆమోదించకుంటే రాజ్‌భవన్ వద్ద ధర్నా చేస్తానని అసెంబ్లీ వేదికగా సీఎం మమతా బెనర్జీ వార్నింగ్స్ ఇవ్వడం దారుణం. గవర్నర్ పదవిలో ఉన్నవారికి ఈవిధమైన అల్టిమేటం‌లు ఇవ్వడం సరికాదు’’ అని ఎక్స్ పోస్ట్‌లో రాజ్‌భవన్ వ్యాఖ్యానించింది. పాలనాపరమైన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే క్రమంలోనే సీఎం మమతా బెనర్జీ ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తున్నారని పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed