మహిళా న్యాయవాదులకు అత్యాచార బెదిరింపులు: బెంగాల్ ప్రభుత్వం

by Harish |   ( Updated:2024-09-17 15:28:11.0  )
మహిళా న్యాయవాదులకు అత్యాచార బెదిరింపులు: బెంగాల్ ప్రభుత్వం
X

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై బెంగాల్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న మహిళా న్యాయవాదులకు అత్యాచార, భౌతిక దాడుల బెదిరింపులు వస్తున్నాయని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. హత్యాచార ఘటనను సుమోటోగా స్వీకరించి విచారిస్తున్న డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తన వాదనలు వినిపిస్తూ, నా ఛాంబర్‌లో మహిళలకు అత్యాచార బెదిరింపులు వస్తున్నాయి. ఇంకా వారిపై యాసిడ్‌ పోస్తామని కొందరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారని చెప్పారు.

దీనికి స్పందించిన న్యాయస్థానం మహిళా న్యాయవాదులకు తగిన భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇదిలా ఉంటే విచారణలో భాగంగా హత్యాచార కేసు విచారణ లైవ్ స్ట్రీమింగ్‌ను నిలిపివేయాలని కోర్టును అభ్యర్థించగా, ప్రజాప్రయోజనాల దృష్ట్యా అందుకు న్యాయమూర్తి నిరాకరించారు. అనంతరం కేసు దర్యాప్తు వివరాలను సీబీఐ కోర్టుకు సబ్మిట్ చేయగా, బెంచ్ దానిని పరిశీలించింది. అయితే ఈ వివరాలను బయటకు వెల్లడించడం వల్ల దర్యాప్తుకు ఆటంకం కలుగుతుందని పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed