Bengal anti-rape bill: పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో హత్యాచార నిరోధక బిల్లు

by Shamantha N |
Bengal anti-rape bill: పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో హత్యాచార నిరోధక బిల్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం అసెంబ్లీలో కోల్ కతా హత్యాచార మృతురాలికి మమతా బెనర్జీ నివాళులు అర్పించారు. ఇలాంటి ఘోరాలు జరగకుండా బెంగాల్ ప్రభుత్వం ప్రత్యేక బిల్లుని తీసుకొచ్చింది. అసెంబ్లీలో మంగళవారం బెంగాల్ ప్రభుత్వం హత్యాచార నిరోధక బిల్లును ప్రవేశపెట్టింది. ‘అపరాజిత విమెన్ అండ్ చైల్డ్ బిల్లు’ పేరిట దానిని తీసుకువచ్చింది. ఇందుకోసం ప్రత్యేక సెషన్‌ను నిర్వహిస్తోంది. చర్చ తర్వాత ఆ బిల్లుకి ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. బిల్లు ప్రవేశపెట్టాక అసెంబ్లీలో మమతా బెనర్జీ మాట్లాడారు. ఉన్నావో, హత్రాస్ దారుణాల గురించి ప్రస్తావించి.. పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. బెంగాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లు చరిత్రాత్మకమని వ్యాఖ్యానించారు. ఇకపోతే, హత్యాచార ఘటనపై మమత ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తోన్న విపక్షాలు సైతం ఈ బిల్లుకి మద్దతు ఇవ్వడం గమనార్హం.

మమతా బెనర్జీ ఏమన్నారంటే?

అసెంబ్లీలో దీదీ మాట్లాడుతూ.. ‘‘ కోల్ కతా హత్యాచార బాధితురాలికి సీబీఐ నుంచి న్యాయం కోరుతున్నాం. దోషులకు మరణశిక్ష విధించాలి. మేం ప్రవేశపెట్టిన బిల్లుపై గవర్నర్ సంతకం చేసేలా విపక్షాలు చూడాలి. ఆ తర్వాత దాన్ని అమలు చేసే బాధ్యత మాది. ఈ బిల్లు ద్వారా కేంద్రచట్టంలోని లోపాలను సరిద్దిద్దే ప్రయత్నం చేస్తున్నాం. సత్వర విచారణ, బాధితులకు న్యాయం లభించడమే ఈ బిల్లు లక్ష్యం. బిల్లు పాస్‌ అయిన వెంటనే.. ప్రత్యేక అపరాజిత టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటుచేస్తాం. లైంగిక దాడులకు పాల్పడకుండా సామాజిక సంస్కరణలు రావాలి. ఉత్తరప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లోనూ నేరాలు జరుగుతున్నాయి. ఉన్నావో, హత్రాస్ కేసుల్లో న్యాయం గురించి ఎవరూ మాట్లాడటం లేదు. కానీ బెంగాల్‌లో మహిళలకు కోర్టుల్లో న్యాయం లభిస్తుంది. మీలాగే నేను కూడా.. ప్రధాని, హోంమంత్రిపై నినాదాలు చేస్తే ఎలా ఉంటుంది..? మహిళ రక్షణ కోసం సమర్థవంతమైన చట్టాలు తీసుకురాలేని ముఖ్యమంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేయండి’’ అని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed