- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మార్చిలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు
దిశ, డైనమిక్ బ్యూరో: వచ్చే నెల(మార్చి)లో బ్యాంకు సెలవులకు సంబంధించిన జాబితాను ఆర్బీఐ రిలీజ్ చేసింది. ఈ నెలలో 10 సెలవులు రాగా, మార్చిలో హోలీతో కలుపుకుని మొత్తం 12 రోజులు సెలవులు రానున్నాయి. ఇందులో వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ సెలవులను బట్టి బ్యాంకులు మూసి ఉంటాయి. ఈ ప్రాంతీయ సెలవులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. మార్చిలో 3వ తేదీ నుంచి మొదలుకుని 5, 7, 8, 9, 11, 12, 19, 22, 25, 26, 30 తేదీల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. ఇందులో రెండో, నాలుగో శని, ఆదివారాల సెలవులు కూడా ఉన్నాయి. అయితే, ఇందులో తెలుగు రాష్ట్రాల బ్యాంకులకు 9 రోజులు సెలవులు ఉండనున్నాయి. మార్చి 7, 8వ తేదీలలో హోలీ పండుగ ఉంది. దీంతో రెండు రోజులు సెలవులు వచ్చాయి. మార్చి 5, 12, 19, 26వ తేదీల్లో ఆదివారాలు, మార్చి 11, 25వ తేదీల్లో రెండు, నాలుగో శనివారాలు వచ్చాయి. ఇక మార్చి 30వ తేదీన శ్రీరామనవమి ఆఖరి సెలవుగా మొత్తం 9 రోజులు సెలవులు రానున్నాయి.