Bangladesh citizens: భారత్‌లోకి అక్రమ ప్రవేశం..23 మంది బంగ్లాదేశ్ పౌరుల అరెస్ట్

by vinod kumar |
Bangladesh citizens: భారత్‌లోకి అక్రమ ప్రవేశం..23 మంది బంగ్లాదేశ్ పౌరుల అరెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన 23 మంది బంగ్లాదేశ్ పౌరులను త్రిపుర రాజధాని అగర్తలా రైల్వే స్టేషన్‌లో రైల్వే పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వీరంతా ఉద్యోగాల కోసం భారత్‌ వచ్చినట్టు తెలిపారు. అసోంలోని గౌహతి మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. పౌరులందరూ బంగ్లాదేశ్‌లోని చపైనవాబ్‌గంజ్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఈ కేసులో ఎండీ సెలిమ్ రెజాను నిందితుడిగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. వీరందరినీ విచారించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతకుముందు ఇండో-బంగ్లా అంతర్జాతీయ సరిహద్దును అక్రమంగా దాటినందుకు నలుగురు బంగ్లాదేశ్ మహిళలను అగర్తల రైల్వే స్టేషన్‌లో అరెస్టు చేశారు. నిందితులకు సహాయం చేసినందుకు ఒక భారతీయుడిని కూడా అరెస్టు చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed