- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bangladesh: భారత్‌ను ఎల్లప్పుడూ 'సన్నిహిత దేశంగానే' భావిస్తాం: బీఎన్‌పీ జనరల్ సెక్రటరీ
దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం మధ్య తాజాగా భారత్‌తో సంబంధాలపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) జనరల్ సెక్రటరీ మీర్జా ఇస్లాం ఆలంగీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవాలనే తన పార్టీ కోరికను ఆయన వ్యక్తం చేశారు. భారత్ పొరుగు దేశమే కాకుండా సన్నిహిత దేశంగా భావిస్తున్నాం. అయితే ఇరు దేశాల మధ్య ఉన్న అనేక కీలక సమస్యల పరిష్కారం కూడా అవసరమని, అందుకు సానుకూలంగా ఉన్నామని అన్నారు. మంగళవారం ఏఎన్ఐతో మాట్లాడిన ఆయన.. బీఎన్‌పీ భారత్‌తో స్నేహపూర్వక సంబంధాన్ని కోరుకుంటోందని, ఈ సమస్యల పరిష్కారాలను కనుగొని ముందుకు సాగాలని ఆలంగీర్ అభిప్రాయపడ్డారు. ఈ సంబంధాలు ఖచ్చితంగా మరింత బలపడతాయి. ఎందుకంటే మేము ఒక రాజకీయ పార్టీగా, భారత్‌ను ఎల్లప్పుడూ మా పొరుగు దేశంగా, సన్నిహితంగా భావిస్తాము. అయితే కొన్ని సమస్యలపై ఒక పరిష్కారానికి రావాలని మేము భారత్‌ను కూడా ఆహ్వానిస్తున్నాము' అని అలంగీర్ అన్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న సమస్యలు 'పూర్తిగా రాజకీయమైనవి', మతపరమైనవి కాదని అలంగీర్ పేర్కొన్నారు. పరిస్థితిని స్వయంగా అంచనా వేయడానికి ఢాకాను సందర్శించాలని ఆయన వెల్లడించారు.