- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
US Elections: అమెరికాలో బ్యాలెట్ బాక్సులకు నిప్పంటించిన దుండగులు
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు దారుణం జరిగింది. వాషింగ్టన్, ఒరెగాన్ ప్రాంతాల్లోని బ్యాలెట్ బాక్సులకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఒరెగాన్‌లోని పోర్ట్‌ల్యాండ్‌లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో మంటలు చెలరేగి మూడు బ్యాలెట్ బాక్సులు దెబ్బతిన్నాయి. వాషింగ్టన్‌లోనూ అగ్నిప్రమాదం జరిగింది. అయితే ఇక్కడి బ్యాలెట్ బాక్సులకు ఎటువంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఇది ఉద్దేపూర్వకంగా జరిగిన ఘటనగా పోర్ట్‌ల్యాండ్ పోలీస్ అధికారి తెలిపారు. మండే స్వభావం కలిగిన పదార్థాలను బ్యాలెట్ బాక్సుల కింద అమర్చడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో, శనివారం మధ్యాహ్నం 3:30 గంటల తర్వాత పీడీటీలో ఓటు వేసిన అభ్యర్థులు ఎన్నికల అధికారులను సంప్రదించాలని స్థానిక అధికారులు వెల్లడించారు. మరోవైపు ఫినిక్స్‌లో గురువారం మెయిల్‌బాక్స్‌కు నిప్పంటించిన ఘటన జరిగింది. ఆ దారుణానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ ఘటనలో 20 బ్యాలెట్ బాక్సులు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఇకపోతే, నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థిగా కమలా హ్యారిస్ బరిలో ఉన్నారు.