- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లక్ష మైనర్ కేసులు వెనక్కి తీసుకున్న సీఎం..
డిస్పూర్: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ కీలక ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం లక్ష మైనర్ కేసులను వెనక్కి తీసుకుంటుందని ప్రకటించారు. వీటిలో సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులపై పెండింగ్ లో ఉన్న కేసులు ఉన్నాయని కూడా తెలిపారు. సోమవారం గువహటిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. న్యాయవ్యవస్థపై భారాన్ని తగ్గించేందుకు కృషి చేస్తామని అన్నారు. అసోంలో మొత్తం 4లక్షల పెండింగ్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ లక్ష కేసుల తగ్గింపుతో లైంగిక దాడి, హత్య వంటి తీవ్రమైన నేరాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టడానికి న్యాయవ్యవస్థకు సహాయపడుతుందని చెప్పారు. రాష్ట్ర విద్యారంగానికి ఊతమిచ్చేందుకు విద్యా సంస్థల మౌలికసదుపాయాల వసతుల కల్పనకు రూ.10,000 వేల అందించనున్నట్లు అందజేయనున్నట్లు వెల్లడించారు. దేశం కోసం ప్రాణాలు ఆర్పించిన స్వాతంత్య్ర పోరాట యోధులకు ఆయన నివాళులు ఆర్పించారు. త్వరలోనే 1000 మంది యువతను అండమాన్ జైలు సందర్శన కోసం పంపనున్నట్లు తెలిపారు. ఇది వారికి విద్యా పర్యటన సహాయకంగా ఉండటమే కాకుండా వీరుల త్యాగాలను అర్థం చేసుకునేందుకు దోహదపడుతుందని అన్నారు.