- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యంగా అసోం సర్కారు కొత్త పథకం
దిశ, నేషనల్ బ్యూరో: బాల్య వివాహాలు అరికట్టేందుకు అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నిజుత్ మొయినా పథకానికి అసోం రాష్ట్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యేంతవరకు బాలికలను ప్రభుత్వమే చదివించనుంది. దీనికోసం రూ.300 కోట్లు కేటాయించనుంది. ప్రభుత్వం ప్రతి నెలా విద్యార్థినీల ఖాతాల్లో రూ.1000 జమ చేయనుంది. డిగ్రీలో చేరినవారికి రూ.1,250.. పోస్టు గ్రాడ్యుయేషన్ చేసే వారికి రూ.2,500 ఇవ్వనుంది. వేసవి సెలవుల్లో మాత్రం స్టైఫండ్ ఇవ్వరు. ఏడాదిలో పదినెలలపాటు విద్యార్థినీల ఖాతాల్లోకి డబ్బు జమ కానుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల కుమార్తెలు, ప్రైవేటు కాలేజీల్లో చదువుతున్న విద్యార్థినీలు మినహా అందరూ ఈ పథకానికి అర్హులే. ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా అందరికీ ఈ పథకం వర్తిస్తుంది.
బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యంగా..
బాల్య వివాహాలు నిర్మూలించేందుకు.. అమ్మాయిల ఉజ్వల భవిష్యత్ కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు అసోం సీఎం హిమంత బిశ్వశర్మ తెలిపారు. ప్రతినెలా 11వ తేదీ నాటికి విద్యార్థుల ఖాతాలో డబ్బు జమ అవుతుందని వివరించారు. పీజీ కోర్సుల్లో చేరిన పెళ్లయిన యువతులకు మినహాయింపు ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా ఈ పథకం వల్ల తల్లిదండ్రులపై భారం చాలా వరకు తగ్గుతుందని పేర్కొన్నారు. తమ కుమార్తెలను కాలేజీలకు, యూనివర్సిటీలకు పంపేందుకు వీలుంటుందని తెలిపారు.