- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Asaduddin: యూఎస్‌లో అక్రమంగా 6.75 లక్షల మంది భారతీయులు.. అసదుద్దీన్ ఒవైసీ

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నారని ఆరోపిస్తూ భారతీయ పౌరులను బహిష్కరించడంపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) స్పందించారు. ఇటీవల వెల్లడైన ఓ నివేదిక ప్రకారం అమెరికాలో ఇంకా 6,75,000 మంది భారతీయ వలసదారులు ఉన్నారని తెలిపారు. అయితే అందులో 18,000 మందిని మాత్రమే తుది జాబితాలో గుర్తించారని, వారి కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రధాని మోడీ భారత దేశ పేరును ప్రపంచం నలుమూలలా తీసుకెళ్లారని, దేశాన్ని సూపర్ పవర్‌గా మార్చారని బీజేపీ నాయకులు చెబుతూనే ఉన్నారు. కానీ వలసదారుల విషయంలో ఏం జరగుతోంది? వారిని ఎందుకు అగౌరవంగా తిరిగి తీసుకువస్తున్నారు?’ అని ప్రశ్నించారు.
తాజా ఘటనలు దేశంలో నిరుద్యోగ సంక్షోభాన్ని బహిర్గతం చేశాయని చెప్పారు. 45 శాతం యువత నిరుద్యోగులుగా ఉన్నారని, అందుకే ఏజెంట్లచే మోసగింపబడి దేశాలు దాటుతున్నారని తెలిపారు. దేశంలో ఇంత తీవ్రంగా నిరుద్యోగ సమస్య ఎందుకు ఉందో ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. అలాగే వలసదారులను ఏవిధంగా తీసుకొస్తారో తెలియజేయాలన్నారు. కాగా, ప్యూ రీసెర్చ్ నివేదిక ప్రకారం అమెరికాలో ఇంకా 6,75,000 మంది భారతీయ వలసదారులు ఉన్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతం 18,000 మందిని మాత్రమే అక్రమ వలసదారులుగా గుర్తించారు.