Arvind Kejriwal: కేజ్రీవాల్ అరెస్ట్‌పై సుప్రీం కోర్టులో పిటిషన్.. ఈ రాత్రికే విచారించాలని కోర్టును కోరిన పిటిషనర్ తరఫు న్యాయవాది

by Shiva |   ( Updated:2024-03-21 17:03:38.0  )
Arvind Kejriwal: కేజ్రీవాల్ అరెస్ట్‌పై సుప్రీం కోర్టులో పిటిషన్.. ఈ రాత్రికే విచారించాలని కోర్టును కోరిన పిటిషనర్ తరఫు న్యాయవాది
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు కాసేపటి క్రితమే అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఢిల్లీ విద్యా శాఖ మంత్రి అతిషి మార్లెనా కీలక వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్‌ను అధికారులు కుట్రపూరితంగా అరెస్ట్ చేసిప్పటికీ ఆయనే తమ ముఖ్యమంత్రి అని తెలిపారు. ప్రభుత్వాన్ని కేజ్రీవాల్ జైలు నుంచే నడిపిస్తారని స్పష్టం చేశారు. కేజ్రీవాల్ అరెస్ట్‌పై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశామని అతిషి తెలిపారు. ఈ రాత్రికే అత్యవసరంగా విచారించాలని కోరుతామని పేర్కొన్నారు. కాగా, ఢిల్లీ హైకోర్టు తీర్పును కేజ్రీవాల్ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తమ పిటిషన్‌ను అత్యవసర ప్రాతిపదికన విచారించాలని సుప్రీం కోర్టుకు విన్నవించారు. కానీ, పిటిషన్‌ను రేపు విచారిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. ఇవాళ రాత్రికే విచారించాలని కేజ్రీవాల్ న్యాయవాది సుప్రీం కోర్టుకు మరోసారి విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed