సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను వేధిస్తున్నారు : సునీతా కేజ్రీవాల్

by Hajipasha |   ( Updated:2024-03-28 11:26:10.0  )
సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను వేధిస్తున్నారు : సునీతా కేజ్రీవాల్
X

దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ ఈడీపై కీలక ఆరోపణలు చేశారు. తన భర్తకు ఆరోగ్యం సరిగ్గా లేదని, ఇటువంటి పరిస్థితుల్లో ఆయన్ను అనవసరంగా వేధిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కక్షపూరిత వైఖరితో ఈవిధంగా విపక్ష నేతలను వేధిస్తే ప్రజలే తగిన సమయంలో తగిన శాస్తి చేశారని సునీత వ్యాఖ్యానించారు. భర్త అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై తనకు ఆందోళనగా ఉందని ఆమె చెప్పారు.

ఈడీ విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధమే

లిక్కర్ స్కాం కేసులో తన పేరును నలుగురు సాక్షులే ప్రస్తావించారని.. ఒక సీఎంను అరెస్టు చేసేందుకు ఆ వాంగ్మూలాలే సరిపోతాయా? అని ‘ఈడీ’ని అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. దేశం ఎదుట ‘ఆప్‌‌’ను ఓ అవినీతి పార్టీగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో ఏడు రోజుల ఈడీ కస్టడీ ముగియనున్న నేపథ్యంలో దర్యాప్తు అధికారులు గురువారం ఆయన్ను కోర్టులో హాజరుపర్చారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి తన వాదనలు స్వయంగా వినిపించారు. ఈడీ విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధమేనని ప్రకటించారు. ఇక అరవింద్ కేజ్రీవాల్ రిమాండ్ గడువును సీబీఐ స్పెషల్ కోర్టు ఏప్రిల్ 1 వరకు పొడిగించింది.

Advertisement

Next Story

Most Viewed