మరో ఆయుధ ప్రయోగం సక్సెస్.. ఏదో తెలుసా ?

by Hajipasha |
మరో ఆయుధ ప్రయోగం సక్సెస్.. ఏదో తెలుసా ?
X

దిశ, నేషనల్ బ్యూరో : రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) తయారుచేసిన ‘మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ సిస్టమ్’ (MPATGM) ఫీల్డ్ ట్రయల్స్‌ను సక్సెస్ ‌ఫుల్‌గా నిర్వహించారు. శనివారం రోజు రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌ వేదికగా యాంటీ ట్యాంక్ మిస్సైళ్లకు సంబంధించిన వార్‌హెడ్ల పనితీరును పరీక్షించారు. ఇక చివరగా దీన్ని ఆర్మీ ఉన్నతాధికారులు పరీక్షించి క్వాలిటీ అనాలిసిస్ చేయనున్నారు. ఆ తర్వాత ఈ క్షిపణి వ్యవస్థను భారత ఆర్మీకి అప్పగించే ప్రక్రియ మొదలవుతుందని అంచనా వేస్తున్నారు. ఇరుకైన మార్గం నుంచి ఎక్కడికైనా తీసుకెళ్లే వెసులుబాటు ఉండటం ‘మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ సిస్టమ్’ ప్రత్యేకత. మొత్తం MPATGM వ్యవస్థలో లాంఛర్లు, లక్ష్య సేకరణ పరికరం, అగ్ని నియంత్రణ యూనిట్ అనే మూడు భాగాలు ఉంటాయి. పగలు, రాత్రి ఎప్పుడైనా శత్రువుల లక్ష్యాలను ధ్వంసం చేసేందుకు దీన్ని రఫ్ అండ్ టఫ్‌గా వాడొచ్చు.

Advertisement

Next Story