అత్యంత వేడి నెలగా ఏప్రిల్..ఎన్ని డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందంటే?

by samatah |
అత్యంత వేడి నెలగా ఏప్రిల్..ఎన్ని డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఏప్రిల్ 2024 ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేడి నెలగా రికార్డు అయినట్టు యూరోపియన్ యూనియన్‌కు చెందిన వాతావరణ ఏజెన్సీ ‘కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్’ వెల్లడించింది. ఈ మేరకు బుధవారం ఓ నివేదికను రిలీజ్ చేసింది. దీని ప్రకారం..ఏప్రిల్‌లో వరుసగా పదకొండో నెల రికార్డు స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రికార్డు స్థాయి వేడి, తీవ్రమైన వర్షపాతం, వరదల వల్ల అనేక దేశాలలో రోజువారీ జీవితానికి అంతరాయం కలిగించాయని పేర్కొంది. ఏప్రిల్‌లో సగటు ప్రపంచ ఉష్ణోగ్రత 15.03 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగిందని తెలిపింది. ఇది పారిశ్రామికీకరణకు ముందునాటి కాలం 1850-1900తో పోల్చితే 1.58 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ.

అలాగే ఏప్రిల్ 1991-2020 సగటుతో పోల్చితే 0.67 డిగ్రీల సెల్సియస్ అధికం కావడం గమనార్హం. అంతేగాక మునుపటి గరిష్ట స్థాయి ఏప్రిల్ 2016 కంటే 0.14 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ. క్షీణిస్తున్న ఎల్‌నినో ప్రభావం, మానవ ప్రేరిత వాతావరణ మార్పుల ప్రభావం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తినట్టు కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ అభిప్రాయపడింది. ‘ఎల్ నినో సంవత్సరం ప్రారంభంలో గరిష్ట స్థాయికి చేరుకుంది. అందుకే తూర్పు ఉష్ణమండల పసిఫిక్‌లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ప్రస్తుతం పెరుగుతున్నాయని ‘కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్’ డైరెక్టర్ కార్లో బ్యూంటెంపో తెలిపారు. కాగా, వాతావరణ సంస్థ తాజా పరిశోధనల ప్రకారం.. మే 2023 నుండి ఏప్రిల్ 2024 వరకు గడిచిన 12 నెలల్లో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత అపూర్వమైన స్థాయికి చేరుకుంది.

Advertisement

Next Story

Most Viewed