- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘నమో హ్యాట్రిక్’ హూడీతో పార్లమెంటులో కేంద్రమంత్రి
దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పార్లమెంటులో స్పెషల్ లుక్‌లో సందడి చేశారు. ‘నమో హ్యాట్రిక్’ అనే క్యాప్షన్‌తో కూడిన కాషాయ రంగు టీ షర్ట్ (హూడీ) ధరించి ఆయన శనివారం పార్లమెంటుకు వచ్చారు. ఈసందర్భంగా మీడియా ప్రతినిధులు ఆయనను పలకరించగా.. తాను ధరించిన హూడీ గురించి వివరించారు. నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి దేశ ప్రధానమంత్రి కాబోతున్నారనే సందేశాన్ని అందరికీ బలంగా చెప్పేందుకే ఈ హూడీ ధరించి వచ్చానని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ‘‘ప్రధాని మోడీ ఎల్లప్పుడూ అభివృద్ధి ప్రస్థానం పక్షానే నిలబడతారు.. మూడోసారీ మోడీ సర్కారే వస్తుంది ... ఈసారి కూడా ఎన్డీఏ కూటమికి 400కుపైనే లోక్‌సభ సీట్లొస్తాయ్’’ అని ఆయన చెప్పారు. అనురాగ్ ఠాకూర్ ధరించిన హూడీపై బీజేపీ ఎంపీ రవి కిషన్ స్పందిస్తూ.. ‘‘యావత్ భారతదేశ ప్రజలు ఇలాంటి హూడీలు ధరించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే భగవాన్ శ్రీరాముడు అందరి హృదయాలలో కొలువై ఉంటారు. అదేవిధంగా మోడీ జీ కూడా సకల జనుల హృదయాలలో నివసిస్తూ ఉంటారు’’ అని పేర్కొన్నారు.
तीसरी बार मोदी सरकार,
— Anurag Thakur (@ianuragthakur) February 10, 2024
अबकी बार 400 पार ✌🏻#NamoHattrick pic.twitter.com/MxwsEcdezg