- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జార్ఖండ్ సీఎంకు మరో షాక్
దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్‌కు మరో షాక్ తగిలింది. రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌తో సంబంధమున్న మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రాంచీ, రాజస్థాన్‌లోని 10 ప్రాంతాల్లో బుధవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా సొరేన్‌కు మీడియా సలహాదారుగా ఉన్న అభిషేక్ ప్రసాద్ ఇంట్లోనూ తనిఖీలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హజారీ బాగ్ డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ రాజేంద్ర దుబే, సాహిబ్ గంజ్ జిల్లా కలెక్టర్ రామ్ నివాస్ నివాసాల్లోనూ సోదాలు చేపడుతున్నట్టు సమాచారం. వీరిద్దరి స్వస్థలాలు రాజస్థాన్‌లో ఉన్నాయి. మనీలాండరింగ్‌తో కేసుతో ముడిపడి ఉన్నందున సొరేన్‌కు ఈడీ శనివారం ఏడోసారి సమన్లు జారీచేసింది. విచారణ తేదీ, స్థలాన్ని నిర్ణయించాలని తెలిపింది. ఇదే చివరి అవకాశమని సమన్లకు కట్టుబడి ఉండాలని తెలిపింది. అయితే వీటికి సొరేన్ స్పందిస్తూ.. తనకు పంపిన సమన్లు చట్టవిరుద్దమని, ఇప్పటికే మొత్తం విషయాన్ని ఈడీ ఇన్వెస్టిగేషన్ చేసిందని, ఇప్పటికే తన ఆస్తుల వివరాలు సైతం ఇచ్చినట్టు తెలిపారు. తన ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే సొరేన్ సన్నిహితుల ఇంట్లో సోదాలు జరగడం గమనార్హం.