మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు మరో షాక్: బీజేపీలో చేరిన మాజీ మంత్రి

by samatah |
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు మరో షాక్: బీజేపీలో చేరిన మాజీ మంత్రి
X

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంటు ఎన్నికల వేళ మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి దీపక్ సక్సేనా బీజేపీలో చేరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సమక్షంలో ఆయన కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. చింద్వారా నుంచి నాలుగుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన దీపక్ కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్‌కు అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. 2018లో కమల్ నాథ్ సీఎం అయినప్పుడు దీపక్ సక్సేనా తన అసెంబ్లీ సీటును వదులుకోవడంతో కమల్ నాథ్ ఎమ్మెల్యే అయ్యారు. గత నెల 22న కాంగ్రెస్‌ను వీడిన సక్సేనా ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌ షాల పనులకు ప్రభావితమై బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. గతంలో ఆయన కుమారుడు అజయ్ సక్సేనా సైతం బీజేపీలో చేరారు. ‘చింద్వారా సిట్టింగ్ ఎంపీ కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ పాలనలో కాంగ్రెస్‌కు లక్ష్యం లేకుండా పోయింది. గత ఆరేళ్లుగా ఛింద్వారాలో కార్మికులు విస్మరించబడ్డారు. కాంగ్రెస్‌ను వీడాలనని నిర్ణయించుకున్నాం’ అని అజయ్ తెలిపారు. కాగా, కమల్ నాథ్‌కు ఇటీవల వరుస షాక్ లు తగులుతున్నాయి. ఆయన సన్నిహితులు ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌ని వీడి బీజేపీలో చేరారు. గత నెల 29న కమల్ నాథ్‌కు అత్యంత సన్నిహితుడు అమరవారా ఎమ్మెల్యే కమలేష్ ప్రతాప్ షా కూడా బీజేపీలో జాయిన్ అయ్యారు.

Advertisement

Next Story

Most Viewed