- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దూకుడు పెంచిన సీబీఐ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో వ్యక్తి అరెస్ట్
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ మరొకరిని అరెస్ట్ చేసింది. ఈ కేసులో నిన్న అరవింద్ సింగ్ అనే న్యూస్ ఛానెల్ ఉద్యోగిని అరెస్ట్ చేసిన సీబీఐ.. మంగళవారం చరణ్ ప్రీత్ సింగ్ అనే మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో హజరు పరుచారు. ఇతనికి రెండు రోజుల సీబీఐ కస్టడీ విధించింది. సోమవారం అరెస్టయి సీబీఐ కస్టడీలో ఉన్న అరవింద్ కుమార్ సింగ్‌తో కలిపి చరణ్ ప్రీత్ సింగ్‌ను సీబీఐ విచారించే అవకాశాలు ఉన్నాయి.
లిక్కర్ స్కాం కేసులో అరవింద్ సింగ్ పాత్ర ఉందని, రూ.17 కోట్ల నగదు లావాదేవీలు జరిపినట్లు సీబీఐ గుర్తించింది. ఈ క్రమంలో తాజాగా చరణ్ ప్రీత్ సింగ్‌ను అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకోవడంతో ఈ కేసు ఎలాంటి మలుపు తీసుకుంటుందో అనే ఉత్కంఠ నెలకొంది. కాగా ఈ కేసులో ఇప్పటికే రెండు ఛార్జిషీట్లు దాఖలు చేసిన సీబీఐ రెండవ అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసే దిశగా అడుగులు వేస్తోంది.