- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తృటిలో తప్పిన మరో ఘోర రైలు ప్రమాదం
దిశ, డైనమిక్ బ్యూరో : లోకోపైలట్ అప్రమత్తతతో తృటిలో మరో ఘోర రైలు ప్రమాదం తప్పింది. రైల్వే క్రాసింగ్ వద్ద గేటు పడుతున్న సమయంలో ఓ ట్రాక్టర్ దాన్ని ఢీ కొట్టింది. వెంటనే అప్రమత్తమైన లోకోపైలట్ రైలు బ్రేకులు వేయడంతో ట్రాక్టర్‌ను నెమ్మదిగా ఢీకొట్టింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఝార్ఖండ్ బొకారో జిల్లాలోని భోజుడి స్టేషన్ సమీపంలో ఉన్న సంతాల్ దియా రైల్వే క్రాసింగ్ వద్ద ఈ ఘటన జరిగింది. రైల్వే గేటును ట్రాక్టర్ ఢీకొనడాన్ని గమనించిన ఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ లోకోపైలట్ వెంటనే బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పిందని రైల్వే అధికారి ఒకరు వెల్లడించారు.
ఈ ఘటనతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు 45 నిమిషాలు పాటు అంతరాయం ఏర్పడిందని తెలిపారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడని, ట్రాక్టర్‌ను జప్తు చేసి కేసు నమోదు చేసుకున్నామని అధికారులు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం 4.40 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు వారు వివరించారు. కాగా, మధ్యప్రదేశ్‌లోను ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. జబల్ పూర్ పరిధిలోని షహపూర్ భితానీ వద్ద ఎల్పీజీ తీసుకుని వెళ్తున్న రైలు..ఈ ప్రమాదానికి గురైంది.