సల్మాన్ ఖాన్‌ను బెదిరించింది అన్మోల్ బిష్ణోయే : ముంబై పోలీసులు

by Shamantha N |
సల్మాన్ ఖాన్‌ను బెదిరించింది అన్మోల్ బిష్ణోయే : ముంబై పోలీసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పులు జరిపిన కేసులో మరో కీలక పరిణామం జరిగింది. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్.. సల్మాన్ ను బెదిరించినట్లు ముంబై పోలీసులు ధ్రువీకరించారు. ఈ కేసులో అరెస్టు చేసిన నిందితుల నుంచి అన్మోల్ బిష్ణోయ్ ఆడియో రికార్డింగ్ ను రికవరీ చేసుకున్నామని పోలీసులు అన్నారు. ఆ రికార్డింగ్ లను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపామని తెలిపారు. కాగా.. ఆ వాయిస్ అన్మోల్ బిష్ణోయ్ దే అని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చినట్లు ముంబై పోలీసులు పేర్కొన్నారు. ఇకపోతే, ఏప్రిల్ 14న సల్మాన్ ఇంటి దగ్గర జరిగిన కాల్పులకు తానే బాధ్యుడునని అన్మోల్ ఇదివరకే ప్రకటించారు. మరోవైపు, ఈ కేసులో ఇప్పటికే మొత్తం ఐదుగురిని అరెస్టు చేశారు. వీరిలో ఒకరు క్రైమ్ బ్రాంచ్ కస్టడీలో ఉన్నప్పుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అన్మోల్ బిష్ణోయ్‌పై ఇప్పటికే పోలీసులు లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు.

Next Story

Most Viewed