అవసరమైతే జార్ఖండ్ సీఎంగా కల్పనా సోరెన్‌ : అంజలి సోరెన్‌

by Hajipasha |
అవసరమైతే జార్ఖండ్ సీఎంగా  కల్పనా సోరెన్‌ : అంజలి సోరెన్‌
X

దిశ, నేషనల్ బ్యూరో : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు ఇప్పటివరకు ఏడుసార్లు సమన్లు ఇచ్చిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తదుపరి చర్యలకు రెడీ అవుతోంది. ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. జార్ఖండ్‌లోని సీఎం అనుచరుల ఇళ్లలో సోదాలను ఈడీ ముమ్మరం చేయడమే దీనికి సంకేతమని చెబుతున్నారు. ఈనేపథ్యంలో సీఎం హేమంత్ సోరెన్‌ సోదరి అంజలి సోరెన్‌ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈడీ విచారణకు సహకరించే క్రమంలో హేమంత్ సోరెన్‌ సీఎం పదవికి రాజీనామా చేస్తే.. ఆయన భార్య కల్పనా సోరెన్‌ సీఎం అవుతారనే ప్రచారంపైనా ఆమె రియాక్ట్ అయ్యారు.

అంజలి సోరెన్ ఏమన్నారంటే..

‘అవసరమైతే సీఎం కావచ్చు. మా పార్టీలో ఇంకా కొందరు సీనియర్ నేతలు కూడా ఉన్నారు. అయితే ఇలాంటి నిర్ణయాలను పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో తీసుకుంటారు. ఇప్పుడే దాని గురించి స్పష్టత ఇవ్వలేం. కామెంట్ చేయలేం ’’ అని అంజలి సోరెన్‌ స్పష్టం చేశారు. ‘‘ హేమంత్ సోరెన్‌ ప్రభుత్వం గిరిజన ప్రభుత్వం. మేం గిరిజనులం కాబట్టే వేధింపులకు గురి చేస్తున్నారు. హేమంత్ సోరెన్ ప్రభుత్వం కొనసాగితే ఆదివాసీల ఓట్లు పడవని బీజేపీ భయపడుతోంది’’ అని ఆరోపణలు గుప్పించారు. అయితే కల్పనా సోరెన్‌‌ను సీఎం చేస్తారనే ప్రచారాన్ని ఇటీవల సీఎం హేమంత్‌ సోరెన్‌ తోసిపుచ్చారు.

Advertisement

Next Story