- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
21 ఏళ్ళ తర్వాత తెరుచుకున్న రామ్ మందిర్! అప్పట్లో నక్సలైట్లు మూసివేశారు!
దిశ, డైనమిక్ బ్యూరో: చత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో 21 ఏళ్ల తర్వాత సీఆర్పీఎఫ్ పోలీసుల చొరవతో రామ మందిరం తలుపులు తెరుచుకున్నాయి. చింతల్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూర్తిగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన కేరళపెండా గ్రామంలో అతి ప్రాచీనమైన రామమందిరం ఉంది. 2003లో ఈ మందిరాన్ని మావోయిస్టులు మూసివేశారని గ్రామస్తులు చెబుతున్నారు. అప్పటి నుంచి నక్సలైట్ల భయంతో ఒక్క కుటుంబం తప్ప గ్రామస్తులు ఎవరు గుడికి వెళ్లలేదని తెలిసింది. కుటుంబ సభ్యులు రహస్యంగా గుడికి వెళ్లి దేవుడికి పూజలు చేసేవారు. అయితే ఆలయ సమీపంలో లఖపాల్‌లో భద్రతా బలగాలు కొత్త క్యాంపును తెరిచాయి. అనంతరం సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికి చేరుకుని గ్రామస్తుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
గ్రామస్తులు ఆలయ పరిస్థితి గురించి చెప్పారు. అంతేకాదు తిరిగి తాము పూజలు చేసుకుంటామని గుడి తెరిపించాలని వారు జవాన్లను అభ్యర్థించారు. దీంతో గ్రామస్తుల కోరిక మేరకు సీఆర్పీఎఫ్ అధికారులు గుడి తలుపులు తెరిచి మందిరాన్ని శుభ్రం చేశారు. అనంతరం జావాన్లు, గ్రామస్తులు పూజలు నిర్వహించారు. గుడి తెరవగానే గ్రామస్తుల్లో ఆనందం వెల్లివిరిసింది. గుడిలో ఉన్న రాముడు, సీత, లక్ష్మణుల విగ్రహాలకు పూజలు చేశారు. ఈ మందిరం అతి పురాతనమైనదని, ఎవరు కట్టారో కూడా స్థానికులు తెలియదంటున్నారు. కాగా, ఈ గుడి దాదాపు 5 దశాబ్దాల నాటిదని సమాచారం.