Amritsar airport: అమృత్ సర్ ఎయిర్ పోర్టుకు హైఅలెర్ట్

by Shamantha N |
Amritsar airport: అమృత్ సర్ ఎయిర్ పోర్టుకు హైఅలెర్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్ లోని అమృత్ సర్ ఎయిర్ పోర్టుకు హై అలెర్ట్ ప్రకటించారు అధికారులు. ఆగస్టు 26న శ్రీ గురురామ్ దాస్ జీ ఎయిర్ పోర్టు దగ్గర మూడు డ్రోన్లు ఎగురుకుతున్న భద్రతా సిబ్బంది గుర్తించారు. డ్రోన్ల గురించి సమాచారం అందడంతో.. సోమవారం రాత్రి హెచ్చరికలు జారీ చేసినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. మూడు డ్రోన్‌లను గుర్తించిన తర్వాత మూడు గంటలకు పైగా విమాన కార్యకలాపాలు నిలిచిపోయాయన్నారు. విమాన సర్వీసుల్లో అంతరాయం కారణంగా ల్యాండింగ్ నిరాకరించడంతో ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానం తిరిగి వెళ్లిపోయిందన్నారు. మంగళవారం తెల్లవారుజాముల ల్యాండ్ అయ్యిందన్నారు.

పోలీసులు ఏమన్నారంటే?

ఈ ఘటన గురించి అమృత్‌సర్ పోలీసులు మాట్లాడారు. “విమానాశ్రయ ప్రాంగణంలో డ్రోన్‌కు సంబంధించి ఎయిర్‌పోర్ట్ అథారిటీ నుండి సమాచారం అందింది. ఆ తర్వాత మేం దాన్ని ధ్రువీకరించాం. కానీ, ఎలాంటి అనుమానాస్పద వస్తువుని కనుగొనలేదు. దీనిపై దర్యాప్తు కొనసాగుతంది. రిజిస్టర్డ్ ఫిర్యాదుగా స్వీకరించి.. హెచ్చరికలు జారీ చేశాం" అని పోలీసులు తెలిపారు. ఇదేవిధంగా, గత ఏడాది నవంబర్‌లో ఇంఫాల్ ఎయిర్ పోర్టు కూడా హై అలర్ట్ లో ఉంది. భద్రతా సిబ్బందికి చిన్న-పరిమాణ డ్రోన్ కనిపించడంతో ఇంఫాల్ ఎయిర్ పోర్టులో తనిఖీలు జరిగాయి. అయితే, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నిబంధనల ప్రకారం, "రెడ్ జోన్‌లు"గా పరిగణించే విమానాశ్రయాలు, సమీప ప్రాంతాల్లో డ్రోన్‌లు ఎగరడానికి అనుమతి లేదు.

Advertisement

Next Story

Most Viewed